calender_icon.png 2 January, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందుచూపుతోనే కేసీఆర్ ట్రిపుల్‌ఆర్ ఆలోచన

30-12-2024 02:09:50 AM

మాజీ ఎంపీ వినోద్ కుమార్ 

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దూర దృష్టితోనే రీజినల్ రింగ్ రోడ్డు ఆలోచన చేసినట్లు మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి వచ్చే పది జాతీయ రహదారులను అనుసంధానించేలా ట్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్ రూపొందించామని, ఈ అంశంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కేసీఆర్, తాను పార్టీ ఎంపీలతో కలిసి అనేక సందర్భాల్లో చర్చించి, అనుమతులు పొందామని గుర్తుచేశారు.

ఓఆర్‌ఆర్ తరహాలో సుమారు 300 కిలోమీటర్లు మేర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ట్రిపుల్‌ఆర్ నిర్మిస్తే వేల కోట్ల తెలంగాణ ప్రజల ధనం ఖర్చవుతుందని కేసీఆర్ భావించారని తెలిపారు. అందుకే కేంద్ర నిధులతో రోడ్డును నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.

నాగ్‌పూర్, విజయవాడ, బెంగళూరు, తదితర జాతీయ రహదారుల వాహనాలు నగరంలోకి రాకుండానే గమ్యస్థానాలకు వెళ్లేలా హైవేల అనుసంధానాలతో ట్రిపుల్ ఆర్ నిర్మించా లని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించడం తగదన్నారు. ఉత్తర భాగం పనులకు టెండర్లు పిలువడంతోనే ఆపకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు.