calender_icon.png 22 April, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమమే పరమావధిగా కేసీఆర్ పాలన

22-04-2025 12:47:51 AM

వనపర్తి, ఏప్రిల్ 21 ( విజయక్రాంతి ) :  సంక్షేమమే పరమావధిగా కె.సి.ఆర్ పాలన జరిగిందని  జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు మంగళవారం వనపర్తి మం డలములోని రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ అంకూర్,చిం గుంటపల్లి,వెంకటాపూర్ తదిర గ్రామాలలో వాకిటి శ్రీధర్ పర్యటించి శ్రేణులను సమాయత్తం చేశారు.

ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమ లు చేయాలని గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ ఏం.ఎల్.ఏ,ఎం.పి ఇతర కాంగ్రెసు ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు.

కుట్రలు,కుతంత్రాలు, దుష్ప్రచారలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం సంక్షే మ పథకాలైన 7500(సీజన్)కు రైతు భరో సా,2లక్షల రుణ మాఫీ, రైతు భీమా,మహిళలకు 2500,తులం బంగారం,నిరుద్యోగు లకు 2లక్షల ఉద్యోగాలు,విద్యార్థినులకు స్కూటిలు,ఆసరా పింఛన్లు 4000ఇస్తామని మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాణిక్యం,రవిప్రకాష్ రెడ్డి,మహే శ్వర్ రెడ్డి,చిట్యాల. రాము,శివ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.