09-04-2025 01:46:50 AM
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎంగా కేసీఆర్ ఆదర్శవంతమైన పాలన అందించి దేశంలోనే రాష్ట్రాన్ని రోల్‌మోడల్‌గా నిలిపారని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
హైదరాబాద్ తెలంగాణభవన్‌లో మంగళవారం గ్రేటర్‌స్థాయి బీఆర్‌ఎస్ ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈనెల 27న వరం గల్‌లో నిర్వహించనున్న రజతోత్సవ మహా సభ ఏర్పాట్లపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా సమావేశానికి అధ్యక్షత వహించిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.
ఈనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవాలని, అన్ని డివిజన్లలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాలన్నారు. ఈనెల 20న గ్రేటర్ హైదరాబాద్ విస్తృతస్థాయి సమావేశానికి కేటీఆర్ హాజరవు తారని తెలి పారు. సమావేశంలో గ్రేట ర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పాల్గొన్నారు.