నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా
ఖమ్మం, జనవరి 2 (విజయక్రాంతి): కేసీఆర్ తన పాలనలో ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతికి తెరలేపారని ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయబాబు ఆరోపించారు. గురువారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తూ నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు.
గోదావరి, కృష్ణా జలాలను పాలేరు నియోజకవర్గానికి అం దించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీతారామ ప్రాజె క్టుతో పాటు మిగతా అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుపై పెద్దఎత్తున ఖర్చు చేశామని చెప్పుకొనే బీఆర్‌ఎస్ నాయకులు, జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా సాగునీటిని అందించలేకపోయారని అన్నారు.