calender_icon.png 25 February, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం

25-02-2025 01:43:23 AM

  • అందుకే అభ్యర్థిని బరిలో నిలపలేదు
  • కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత.. మీ ఓటు ఎవరికో చెప్పాలి
  • మేం చేసినవే చెప్తున్నాం.. మాకు అండగా నిలవండి
  • రాష్ర్ట ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): కేసీ ఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో నిలపలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం 8 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయి బీజేపీ గెలవడంలో కూడా ఈ ఒప్పందం దాగి ఉందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు వేయదంటున్న ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీశరావు, కవితలు తాము ఓటు ఎవరికి వేస్తున్నారో చెప్పాలని రాష్ర్ట ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

సోమవారం రాత్రి కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సంకల్ప సభకు సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలు కాంగ్రెస్ ను ఓడిస్తామని అంటున్నారని, వారు ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించమని తెలిపితే అభ్యంతరం లేదని అన్నారు.

ఏ అభ్యర్థికి ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలనుకుంటున్నారు, మీ అభ్యర్థి ఎవరు చెప్పాలని డిమాండ్ చేశారు. మీ ఓట్లు ఎవరికి, మీ మద్దతు ఎవరికి, ఎవరిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీని ఓడగొడతామని అంటున్నారని ప్రశ్నించారు. 2023లో రాష్ర్టంలో అధికారం కోల్పోయారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు, బీజేపీ అభ్యర్ధులను గెలిపించారని అన్నారు.

కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్‌ఎస్ ను ఢిల్లీలో తాకట్టుపెట్టారని అన్నారు. మీ పార్టీ డిపాజిట్ గల్లంతయ్యే స్థితి తెలంగాణలో ఉందా, ఎమ్మెల్యే ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామంటున్నారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కను, ద్వేషం, అసూయతో బీజేపీని గెలిపించేందుకు ప్రయత్ని స్తున్నారని, చీకటి ఒప్పందం చేసుకున్నారని అన్నారు.

చీకట్లో కాళ్లు పట్టుకుని, పొద్దున ఫోటోలు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రగా ఉన్నాడు, 12 ఏళ్లు మోడీ ప్రధానిగా ఉన్నారు, వారు చేయని దానిని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. సంవత్సర కాలంలో ఉద్యోగులు, టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు.

పదేళ్లలో టెట్, డీఎస్సీ నిర్వహిం చకుండా కేసీఆర్ ప్రభుత్వం తండాలలో, గ్రామాల్లో పాఠశాలలను మూసివేస్తే, సంవత్సర కాలంలోనే టెట్ నిర్వహించి, డీఎస్సీ నిర్వహించి 11 వేల మందికి ఉద్యోగాలిచ్చామని అన్నారు. 5 లక్షల మందికి ఉద్యోగుల కు 20వ తేదీ వరకు కూడా జీతాలు రాలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వా త ప్రతి నెల మొదటి తారీఖునే జీతం ఇస్తున్నామని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.

మీ ఆత్మను ప్రశ్నించుకోండి, మీరు ఆలోచన చేయాలని కోరారు. ఆత్మగౌరవం నిలబెట్టడానికి ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పెన్షనర్లు ఒకటవ తారీఖునే ఇస్తున్నా మని, ఆలోచన చేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. 

ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిట్టర్ లాంటి ఐటీఐ సర్టిఫికెట్లు నాలు క గీక్కోవడానికి కూడా పనికిరాలేదాని, టా టా కంపెనీతో మాట్లాడి  ఐటీఐలను అప్‌గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ సెంటర్లుగా మారి ట్రైనిం గ్ ఇచ్చి టాటా కంపెనీ ఉద్యోగులుగా తీసుకునేలా మార్చామని అన్నారు. 140 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఒలంపిక్స్లోలో ఒక్క గోల్డ్ మెడల్ రాలేదని, 10 కోట్ల మంది ఉన్న దక్షిణ కొరియా 32 గోల్డ్ మెడల్స్ సాధించిందని అన్నారు.

అందుకే ఆలోచన చేసి మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలనే ఆలోచనతో ఈ దేశ గౌరవం పెంచాలని స్పో ర్ట్స్ ఇండియా యూనివర్సిటీ పెట్టి రాబోయే 2028 ఒలంపిక్స్లో లో గోల్డ్ మెడల్స్ సాధించేలా తెలంగాణ రాష్ర్టం తీసుకువవస్తున్నా మన్నారు.

ప్రతి సంవత్సరం 1,10 వేల మం ది పట్టా తీసుకుని ఇంజనీర్లు వస్తున్నారని, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఇంజనీరింగ్ చదువుకొని చిన్న చిన్న పనులు చేసు కోలేకోతున్నారని, చేసే పనికి చదువుకు పోలిక లేక ఇబ్బందులు పడుకున్నారని అన్నారు. స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ర్టం ప్రారంభించిందని అన్నారు.

ఆనంద్ మహేంద్రను చైర్పర్సన్, కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లతో 60 ఎకరాల్లో 600 కోట్లతో ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా నిర్ణయం తీసుకున్నామని, ఇలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న ఈ తరుణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.

వరంగల్ అమ్మాయి కీర్తి పారా ఒలంపిక్స్లోలో మెడల్ సాధిస్తే జాబ్ ఇవ్వదుతోపాటు స్థలం, 25 లక్షలు నగదు ఇచ్చామని అన్నారు. తెలంగాణ క్రీడ ల్లో, వృత్తి నైపుణ్యంలో కేసీఆర్ ఈ పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం వల్ల కుప్పకూలాయని అన్నారు. రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని, 25 లక్షల 50 వేల మంది రైతులకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల రూపాలయ చొప్పున 25 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని అన్నారు.

ఎన్నికలను అడ్డు పెట్టుకుని కేసీఆర్ పారిపోయి వదిలిస్తే ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుబంధు డబ్బులు వేశామని అన్నారు. వరి వేసుకుంటే ఉరే అన్నా రు, కానీ మేము వరి వేసుకుంటే 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశంలో మొదటి స్థానంలో నిలిచామన్నారు.

తాలు, తౌడు, తడి పేరుమీద తరుగు తీసేవారని, క్వింటాలుకు 10 కిలోలు బీఆర్‌ఎస్ నాయకులు కొట్టే వారని, రైతుబందు ఇచ్చినదానికంటే కాలు, తౌడు పేరుతో బీఆర్‌ఎస్ నాయకులు తీసుకున్నదే ఎక్కువని అన్నారు. పంటకు గిట్టుబాటు ధర, బోనస్ ఇచ్చిన మాకు ఓటేస్తారా, వేరేవారికి ఓటేస్తారా ఆలోచన చేయాలన్నారు.

లక్ష కోట్లతో కాళేశ్వరం కదితే కూలిపోవడం ఏమిటని, అలాంటి దుర్మార్గుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతామంటున్నారు. రైతులు ఆలోచన చేయాలన్నారు. రైతులకు ఉచిత కరెంట్, 500 రూపాయలకే సిలిండర్, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నామని అన్నారు.

55,163 ఉద్యోగాలను ఇచ్చిన మాట ప్రకారం కల్పించామని, ఏ దేశంలో ఏ రాష్ర్టంలో ఇవ్వని విధంగా ఇచ్చామన్నారు. సంజయ్ రెండుసార్లు ఎంపీ అయిన, కేంద్ర మంత్రి అయిన ఏం తీసుకురాలేదని అన్నారు. 

హైదరాబాద్కు మెట్రో తీసుకువచ్చినవా, ఏం నిధులు తీసుకువచ్చావు అని ప్రశ్నించారు. వందేళ్ల తర్వాత బీసీల లెక్కలు తేల్చిన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు లేరని, మొదటి సంవత్సరంలో ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చేయని సహసం చేసి 56.33 శాతం బీసీలు ఉన్నారని తేల్చామన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్లుగా బీసీల లెక్కలు తేల్చామని అన్నారు.

దేశవ్యాప్తంగా జన గణనలో కుల గణన చేయాలని ప్రధానికి సవాల్ విసిరారు. మేము చేసింది తప్పయితే ముక్కు భూమికి రాస్తామని అన్నారు. బండి సంజయ్ మైనార్టీలను తీసుకువచ్చి బీసీలలో కలిపారని అంటున్నారని, కేంద్ర మంత్రివై ఉండి అవగాహన లేకుండా మా ట్లాడుతున్నారని విమర్శించారు.

బీసీలల్ల మేము చేర్చామా, లేక 1979లో మండల కమిషన్ ముస్లింలను చేర్చిందా లేదా అని మీ అధికారులను అడిగాలని, అజ్ఞానంతో మాట్లాడవద్దని బండి సంజయ్ కి హితవు తెలిపారు. అదే గుజరాత్లో 39 ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయని, మహారాష్ర్టలో 26 ముస్లిం ఉపకు లాలు, మధ్యప్రదేశ్, బీహార్లో ఏ రాష్ర్టమైనా పోదాముని,

మీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో ముస్లింలు బీసీలుగా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని అన్నారు. 75 ముస్లిం కులాలకు బీసీలలో చేర్చారని, మా మీద తోసి మమ్ములను దోషులను చేస్తున్నారని అన్నారని విమర్శించారు. విజ్ఞులు, విద్యావంతులు, ప్రజాస్వామిక వాదులు వీరి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని కోరారు.

13 నియోజకవర్గాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం

కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమలు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ పట్టభద్రులు నరేందర్ రెడ్డిని గెలి పించాలని కోరారు.

పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కరీంనగర్ గడ్డమీద తెలంగాణ ఇస్తానని సోనియాగాంధీ మాట ఇచ్చారు, మాట ప్రకారం తెలంగాణ ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తున్న క్రమంలో వచ్చిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఉన్నది.

కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నా దేహం లో ప్రాణం ఉన్నంతవరకు పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రత్యర్థులు ఎవరు ఈ గడ్డపై ఎంప్లాయిమెంట్ కల్పించినవారు కాదు, సేవ చేసినవారు కాదని, తాను 30 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉండి సేవ లందిస్తూ వస్తున్నానని అన్నారు.