29-04-2025 01:02:46 AM
భీమదేవరపల్లి, ఏప్రిల్ 28: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణకు మొదటి విలన్ కాం గ్రెస్ పార్టీ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎల్కతుర్తి సభలో తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గం భీందేవరపల్లి మండలం ముల్కనూరులో కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సోని యాగాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. సోనియాగాంధీ లేకపోతే వందల కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదన్నారు. అగిపెట్టె రాజకీయాలు చేసి ఆత్మహ త్యలు చేసు కునేలా ప్రేరేపించినట్టుకాదన్నారు.
తెలంగాణకు సంబంధించిన అనేక మంది అమరులయ్యార ని, వారికి ఎందుకు శ్రద్ధాంజలి ఘటించలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును శాసనసభ తిరస్కరించినా, ఆంధ్రా నాయకులు వ్యతిరేకించిన, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలన్ అనే మాటలు ఉపసహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.