calender_icon.png 20 February, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

18-02-2025 01:43:20 AM

కరీంనగర్, ఫిబ్రవరి17(విజయక్రాంతి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  జన్మదిన వేడుకలను నగరంలోని తెలంగాణ చౌక్ లో  బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై  71 కిలోల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో  సూడా మాజీ  చైర్మన్, బిఆ ర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృ ష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మ ణరావు, బిఆర్‌ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షు లు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ కొత్తపల్లి మండల శాఖ అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, పలువురు మాజీ కార్పొరేటర్లు, బిఆర్‌ఎస్ నగర  మైనా ర్టీ శాఖ అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, పలువు రు బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

నుస్తులాపూర్‌లో 

తిమ్మాపూర్, ఫిబ్రవరి 17: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ 71 వ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం డల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మండ లంలోని నుస్తులాపూర్ లో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, బిఆర్‌ఎ స్ పార్టీ రాష్ర్ట నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి,ల ఆధ్వర్యంలో నిర్వహించార.

పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచు కున్నారు.  కార్యక్రమంలో  మానకొండూర్ నియోజకవర్గ కన్వీనర్ వంతడ్పుల సంపత్ , నాయకులు; నాయిని వెంకట్ రెడ్డి, మాజీ వైస్ ఎంపిపి ల్యాగల వీరారెడ్డి, పాశం అశోక్ రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, పెట్టం రమేష్, మాదని రాజెందర్, గడ్డి రమేష్, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జగిత్యాలలో

జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 17: జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సోమవారం టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘ నంగా నిర్వహించారు. జగిత్యాలలో జెడ్పి మాజీ చైర్పర్సన్ దావ వసంత నేతృత్వంలో, కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో, మెట్పల్లి పట్టణంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు వేడుకలు నిర్వహించారు. జగిత్యాలలోని వాల్మీకి ఆవాసంలో తెలంగాణ రాష్ర్ట తొలి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 71వ జన్మదిన వేడుకలను  నిర్వహించారు.

కార్య క్రమంలో పాల్గొన్న మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ అపర భగీరథుడు, తెలంగాణ రాష్ర్ట ప్రదాత కెసిఆ ర్ జన్మదిన వేడుకలు జగిత్యాలలో ఘనంగా నిర్వహించామన్నారు. జిల్లా అధ్యక్షుడు కల్వ కుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ మంత్రి రాజేశం గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు దే వాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిం చడంతో పాటూ ఆసుపత్రిలో రోగులకు పం డ్ల పంపిణీ చేశారు.

కల్లాకపటం తెలియని చిన్నారుల ఆశీర్వాద బలం కూడా కేసీఆర్ కు ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో ఆయు రారోగ్యాలతో చల్లగా ఉండి తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కోసం మరింత కృషి చేసే అవకా శం ఉంటుందని ఆకాంక్షించారు. కెసిఆర్ జన్మదినం సందర్భంగా  ఎమ్మెల్సీ ఎల్ రమ ణ కుమారుడు, యువ నాయకుడు ఎల్ కార్తికేయ ఆవాసంలో అన్నదాన కార్యక్రమా న్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో బిఆ ర్‌ఎస్ నాయకులు దారిశెట్టి రాజేష్, గట్టు సతీష్ మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

హుజరాబాద్ పట్టణంలో

హుజురాబాద్, ఫిబ్రవరి17: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ జన్మదిన వేడుకలు సోమవారం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కెసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలతో పాటు హోమం చేశారు.  స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.

వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సతీమణి శాలిని రెడ్డి, కూతురు శ్రీనిక రెడ్డి, బి ఆర్‌ఎస్ రాష్ర్ట కార్యదర్శి బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, అపరాధ ముత్యం రాజు,  కే సి రెడ్డి లావణ్య, రమాదేవి, కొండ్ర నరేష్, ప్రతాపకృష్ణ, ఇమ్రాన్, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

కోనరావుపేట మండల కేంద్రంలో 

కోనరావుపేట, ఫిబ్రవరి 17:  కోనరా వుపేట మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీ ఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంచారు. అనంతరం మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య మాట్లాడుతూ.. తెలంగా ణ రాష్ర్ట తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కేసీఆర్ పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేశాడన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం జరగాలంటే మళ్లీ కేసీఆర్ ను సీఎం చేయాలన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్ యువత మొక్కలు నాటి వేడుకలు జరుపుతున్నారు. ఈ కార్యక్ర మంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరు పతి, పాక్స్ చైర్మన్లు సంకినేని రామ్మోహన్ రావు, బండ నర్సయ్య, నాయకులు కాశవేని మహేష్, కచ్చకాయల మహేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.