calender_icon.png 27 February, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు మళ్లీ అధికారం పగటికలే

20-02-2025 12:55:54 AM

  1. సీజనల్ పొలిటిషియన్.. ఎన్నికలప్పుడే బయటకు 
  2. 14నెలలుగా అజ్ఞాతంలో ఉన్న వ్యక్తికి అభివృద్ధి కనిపిస్తుందా? 
  3. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): “కేసీఆర్ సీజనల్ పొలిటిషి యన్.. అధికారంలోకి వస్తామని పగ టి కలలు కంటున్నారు.. 14 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న వ్యక్తికి అభివృద్ధి ఎలా కనబడుతుంది..” అని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.

కేసీఆర్ తీరు ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అన్నట్టుగా ఉందని బుధవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎన్నికలప్పుడే కనిపించే సీజనల్ పొలిటిషయన్ అని, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనే ప్రజల్లోకి వచ్చే ప్రయ త్నం చేస్తున్నారన్నారు.

మేడిగడ్డ కుంగినప్పుడుగాని, రాష్ట్రంలో భారీ వ ర్షాలు, వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ కు ప్రజలు గుర్తుకురాలేదా..? శాసన స భలో కీలకమైన తీర్మాణాలు, కులగణ న, ఎస్సీ వర్గీకరణ, భూభారతి బిల్లు, తె లంగాణ ఏర్పాటులో కీలక భూమిక పో షించిన మాజీ ప్రధాని మన్మోహన్‌సిం గ్ సంతాప తీర్మానానికి, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కూడా రాలేదన్నా రు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షనేతగా అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించాలని, కేసీఆర్ మాత్రం ప్రజలకు జవాబుదారీతనం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. “నీవు వద్దు.. నీ పాలన వద్దు మహాప్రభో..” అని ప్రజలు వదిలించుకున్నా వదిలేది లేదన్నట్లుగా కేసీఆర్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు.