calender_icon.png 30 October, 2024 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారు

14-07-2024 12:34:35 AM

  1. చంద్రబాబుతో కేంద్రానివి లాలూచీ రాజకీయాలు
  2. బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ 

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాబోయే అసెంబ్లీ సమావేశాలకు వస్తారని మాజీ ఎంపీ బీ.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో వినోద్ మాట్లాడుతూ.. ఏపీ విభజన చట్టంలో ఉన్న అంశాలపై ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోడీతో మాట్లాడారని, ఆ తరువాత విభజన చట్టం షెడ్యూల్ 13లో ఉన్న పెట్రో, కెమికల్, ఆయిల్ రిఫైనరీ హబ్ ఏపీకి ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు.

ఇదే షెడ్యూల్‌లో 13లో తెలంగాణలో కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఉందన్నారు. వీటిని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని పదేళ్లుగా అడుగుతున్నా ఏమీ ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో పెట్రో కెమికల్స్ రిఫైనరీ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, మాకు రావాల్సినవి కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుపై కేంద్రం ఆధారప డటంతో ఏపీకి పెట్రో కెమికల్స్ హబ్ ఇస్తున్నారని, తెలంగాణపై ఆధారపడే అవసరం లేకపోవడంతో ఏమీ ఇవ్వడం లేదని మండిపడ్డారు.

ఏపీలో ప్రాంతీయ పార్టీ గెలవ డంతో చంద్రబాబు అడిగిన డిమాండ్లు నేరవెర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. చంద్రబాబుతో కేంద్రం లాలూచీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ మొండిచేయి చూపిస్తోందని విమర్శించారు. ఏపికీ ఆయిల్ రిఫైనరీ ఇచ్చినట్లుగా తెలంగాణకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటంతో పాటు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.