calender_icon.png 24 October, 2024 | 3:57 AM

సొంత జిల్లాను పట్టించుకోని కేసీఆర్

09-07-2024 04:21:26 AM

  • వనదుర్గామాత ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవడమే అందుకు నిదర్శనం 
  • ప్రసాద్ దర్శన్ పథకంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తా 
  • ఎంపీ రఘునందన్ రావు

మెదక్, జూలై 8 (విజయక్రాంతి)/పాపన్నపేట: మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉండి కూడా సొంత జిల్లాను పట్టించుకోలేదని, అందుకు ఏడుపాయల వనదు ర్గామాత ఆలయం అభివృద్ధి చెందకపోవడమే నిదర్శనమని మెదక్ ఎంపీ ఎం రఘునందన్ రావు విమర్శించారు. ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారి సోమవారం అమ్మవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, పాలక మండలి చైర్మన్ బాలా గౌడ్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం ఏడుపాయలలో, మెదక్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ దర్శన్ స్కీం ద్వారా ఏడుపాయల పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.  పదేళ్ల పాలనలో కేసీఆర్ ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ఏడుపాయలలో శాశ్వత పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, చైర్మన్ బాలా గౌడ్‌కు సూచించారు.  బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పరిణిత, జిల్లా మహిళా అధ్యక్షురాలు వీణ, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, నరేశ్, పెంటయ్య, వెంకటేశం పాల్గొన్నారు.