గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా: కేసీఆర్
ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయి
ఎన్నో ప్రభుత్వాలను చూశా.. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలే
కాంగ్రెస్ వాళ్లు కనపడితే జనాలు కొట్టేలా ఉన్నారు
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు(Kalvakuntla Chandrashekar Rao) శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా.. కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం నా అలవాటు అన్నారు. ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ పెడతామని చెప్పారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయని కేసీఆర్ ఆరోపించారు. సంగమేశ్వరం, బసవేశ్వర, కాళేశ్వరం (Kaleshwaram Project) ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని కేసీఆర్(KCR) ద్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు(BRS leaders), కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ నియోజకవర్గ నేతలతో ఫామ్ హౌస్ లో కేసీఆర్(KCR in farm house) సమావేశమయ్యారు. ఎన్నో ప్రభుత్వాలను చూశా.. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని కేసీఆర్ విమర్శించారు.
ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై ఇంత వ్యతిరేకత వచ్చిందని కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ వాళ్లు కనపడితే జనాలు కొట్టేలా ఉన్నారని చమత్కరించారు. ఏ ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ సోషల్ మీడియా(Congress social media)లో ఓటింగ్ పెడితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం(Bharat Rashtra Samithi) కావాలని జనం ఓట్లేశారని కేసీఆర్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో విజయం మనదే అన్నారు. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని ఆకాంక్షించారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండని పిలుపునిచ్చారు. భూముల ధరలు అమాంతం పడిపోయాయని చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరున భారీ సభ పెడదాం.. మీరంతా తరలిరండని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడేనని కేసీఆర్ స్పష్టం చేశారు.