calender_icon.png 22 October, 2024 | 2:26 AM

ట్రైలర్‌లోనే కథ చెప్పేసిన కేసీఆర్

20-10-2024 12:00:00 AM

కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) అనే చిత్రం ద్వారా రాకింగ్ రాకేశ్ కథానాయకుడిగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రానికి రాకింగ్ రాకేశ్ స్వయంగా కథ రాసుకున్నారు. ఈ సినిమాకు అంజి దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ చేశారు. చరణ్ సంగీతం అందించారు. విభూది క్రియేషన్స్ బ్యానర్ పై రాకింగ్ రాకేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ట్రైలర్‌లోనే దాదాపుగా కథ చెప్పేశారు. కేసీఆర్, అతని మరదలు మధ్య చిన్ననాటి స్నేహాన్ని ప్రెజెంట్ చేస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. తన షార్ట్ నేమ్ కేసీఆర్ అని గర్వంగా యువకుడు చెప్పుకోవడం ఆసక్తికరం. ఆ తరువాత తన మరదలి పెళ్లి ప్రపోజల్‌ని తిరస్కరించి ఒక లక్ష్యంతో హైదరాబాద్ చేరుకోవడం వంటి అంశాలతో ట్రైలర్‌ను కట్ చేశా రు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, ధనరాజ్, తాగుబోతు రమేశ్, జోర్దార్ సుజాత, లోహిత్‌కుమార్, బలగం మైమ్ మధు, రచ్చ రవి, కృష్ణ భగవాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా అనసూయ హాజరయ్యారు.