calender_icon.png 21 February, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

7 నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్

19-02-2025 10:24:49 AM

హైదరాబాద్:  తెలంగాణ భవన్‌లో బుధవారం మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఏడు నెలల విరామం అనంతరం కేసీఆర్ తెలంగాణ భవన్(Telangana Bhavan)కు  వెళ్లనున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు(BRS Working President KT Rama Rao) పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రస్తుత, గతంలో ఎన్నికైన నాయకులందరూ సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. 

దీంతో ఈ సమావేశంలో మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేళ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ప్లీనరీ, ప్రతినిధుల సభపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటుపై చర్చించనున్నారు. ప్రభుత్వ పనితీరు, హామీల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై మాజీ సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మార్చిలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఆ తర్వాత గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కేటీఆర్(KTR), ఇతర నాయకులు రైతులతో బహిరంగ సభలు నిర్వహించడం, ప్రజలకు ఎన్నికల హామీలను నెరవేర్చని కాంగ్రెస్ నాయకులను సవాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల(BRS MLAs)పై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పోరాడుతోంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు(By-elections in Telangana) జరుగుతాయని బీఆర్ఎస్ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.