- కౌశిక్ రెడ్డిని బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి
- రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల
నిజామాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. కౌశిక్‌రె డ్డిని ముందుంచి డ్రామాలు ఆడుతున్నారని, ప్రశాంతంగా ఉన్న తెలంగాణాలో సెటిలర్లు, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కా ర్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్య లను ఖండించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలక భంగం వాటిల్లకుండా పరిపాలన కొనసాగిస్తుందని చెప్పా రు.
ఎన్నికలకు ముందు సెటిలర్స్‌కు అనుకూలంగా మాట్లాడిన కేసీఆర్.. అరికెపూడి గాంధీ విషయంలో కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండిస్తలేరని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు పోలీసులపై చేసి న వ్యాఖ్యలను ఖండించారు. జిల్లాలో ప్రశా ంత్‌రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. అల్లర్లు సృష్టించేందుకు య త్నించిన కౌశిక్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన జిల్లాకు చెందిన మహే శకుమార్ గౌడ్ ఈ నెల 15న గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చే స్తారని, జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉర్డూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వేణు రాజ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.