20-03-2025 01:43:50 AM
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు ఎమ్మెల్యే వాంటెడ్, టూలెట్ బోర్డులు అంటించిన బీజేపీ నాయకులు
గజ్వేల్, మార్చి 19: ఎమ్మెల్యేగా మూడుసార్లు గజ్వేల్ ప్రజలు గెలిపించినా ప్రజలను కలవని గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం గజ్వేల్‌లో బీ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ గేటుకు ‘ఎమ్మెల్యే వాంటెడ్, టు క్యాంప్ ఆఫీస్ ఫర్ ఎమ్మెల్యే అంటూ పోస్టర్లను అంటించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు జశ్వంత్‌రెడ్డి, బండారి మహేశ్ మాట్లాడుతూ.. ఫాంహౌస్‌లో ప్రశాంతమైన జీవితాన్ని కేసీఆర్ గడుపుతున్నారని విమర్శించారు. ప్రజ లు కడుతున్న పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న కేసీఆర్ ప్రజల కోసం పనిచేయ డం లేదన్నారు. ఎమ్మెల్యేగా మూడోసారి కూడా నియోజకవర్గ ప్రజలను కలవడానికి రాకపోవడం శోచనీయమన్నారు.
ప్రతిపక్ష నాయ గజ్వేల్ సమ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేకపోతున్నారని ఆరోపించారు. ఇటు ప్రజల వద్దకు రాకుం డా అసెంబ్లీకి వెళ్లకుండా ఎలాంటి ప్రయోజనం లేని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలన్నారు.
నిరసనలో బీజేపీ సీనియర్ నాయకులు ఉ మధుసుదన్, వెంకటరెడ్డి, దేవేందర్, జిల్లా నాయ శ్రీనివా స్‌రెడ్డి, శ్రీనివాస్, వెంకట్రాంరెడ్డి, సుమతి, నాయకులు అయిల మహేం వెంకటేశ్‌గౌడ్, బారు అరవింద్, యువమోర్చా నాయకులు కరుణాకర్, కొ రాజశేఖర్‌రెడ్డి, రంగంపేట లక్ష్మణ్, నవీన్, స్వామి, రమేశ్, నాయకులు కార్యకర్తలు మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు.
కాగా అల్లరిమూకలు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ గేటు తాళాలు పగులగొట్టాయని, మాజీ సీఎం కేసీఆర్‌ను అసభ్య పదజాలంతో దూషించారని గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్‌సి రాజమౌళి. బీఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.