14-02-2025 12:08:59 AM
పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): కులగణనపై విమర్శలు చేసే అర్హత ప్రతిపక్షాలకు లేదని పీసీ సీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ఎద్దేవా చేశారు. కులగణన సరిగా జరగలేదని కొన్ని కుల సంఘాలు ఆరోపించాయని, అందుకు ప్రభుత్వం ఆలోచన చేసి రీసర్వే నిర్వహిస్తోందన్నారు.
గురువారం గాంధీ భవన్‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌యాదవ్‌తో కలిసి వీహెచ్ మీ డియాతో మాట్లాడారు.. కుల గణన లో తప్పు జరిగిందా..? లేదా అనేది కాదని, కొందరికి అపోహలు ఉన్నా యి కాబట్టే కులగణనను ప్రభుత్వం మరోసారి నిర్వహిస్తుందన్నారు.
ఈ నెల 16 నుంచి 28 వరకు జరిగే రీసర్వేలో అందరూ పాల్గొనాలన్నారు. సమగ్ర కుటంబ సర్వేను చేసి ఎందు కు దాచిపెట్టారో బీఆర్‌ఎస్ నాయకులు చెప్పాలన్నారు. కేసీఆర్ సామా జికవర్గం తక్కువగా ఉంది కాబట్టే ఆయన వెనక్కి తగ్గుతున్నారని, ఇప్పటికైనా కులగణనలో కేసీఆర్ పాల్గొ నాలని వీహెచ్ సూచించారు.