calender_icon.png 26 April, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ సభను విజయవంతం చేయాలి

26-04-2025 05:24:05 PM

గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు వడ్ల లక్ష్మీనారాయణ..

కామారెడ్డి (విజయక్రాంతి): వరంగల్లో నిర్వహిస్తున్న టిఆర్ఎస్ సభకు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నాయకులు తరలిరావాలని కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు వడ్ల లక్ష్మీనారాయణ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు గంగాధర్ రావు వడ్ల శ్రీనివాస్ లు అన్నారు. శనివారం చిన్న మల్లారెడ్డిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసిఆర్ సభను విజయవంతం చేయాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వారు పేర్కొన్నారు. ప్రజలందరికీ కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు చేసిన తీరు గుర్తించుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు. కేసిఆర్ తలపెట్టిన సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు కోరారు.