25-03-2025 05:16:33 PM
బీఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్..
మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ బాపు, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బేషరతుగా కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బండి సంజయ్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ మంగళవారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అహంకారపూరితంగా మాట్లాడిన బండి సంజయ్ పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆయన పర్యటనను తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ పై పిచ్చి ప్రేలాపనలు మానుకొని తెలంగాణకు కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో విఫలమైన బండికి ఉద్యమ నాయకున్ని విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.
మునుముందు ఇలాగే మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కంబగొని సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు జాడి శ్రీనివాస్, రామిడి కుమార్, గడ్డం రాజు, టైలర్ రాజు, స్వరూప, మాజీ ప్రజాప్రతినిధులు పోగుల మల్లయ్య, రెవెల్లి ఓదెలు, జిలకర మహేష్, పారిపెల్లి తిరుపతి, జక్కబోయిన కుమార్, యువ నాయకులు ఆర్నే సతీష్, కొండ కుమార్, లక్ష్మికాంత్, చంద్ర కిరణ్, సాయి కృష్ణ, దినేష్, క్రాంతి, నస్పూరి శివ, గోనే రాజేందర్, బూతగడ్డ రమేష్, ఉదయ్ లు పాల్గొన్నారు.