calender_icon.png 14 November, 2024 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనిషిని మానవత్వంతో చూసిన కేసీఆర్

12-11-2024 02:33:52 AM

మతపరంగా, ఓట్ల పరంగా ఏనాడుచూడలే

బీఆర్‌ఎస్ పాలనలో గంగాజమున తహజీబ్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాం తి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మనిషిని మనిషిగా మానవత్వంతో చూశారని, ఏనాడూ మతపరంగా, ఓట్ల పరంగా చూడలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు  స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ పాలనలో గంగా-జమున తహజీబ్‌ను పాటించటంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. సోమవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో పేద ముస్లిం విద్యార్థులకు నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తమ పాలనలో అన్ని మతాల వారికి మేలుచేసే విధంగా బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్‌మస్ కానుకలు ఇచ్చామని గుర్తుచేశారు. అందరినీ కలుపుకొని పోతామని చాలామంది చెప్తారు కానీ కేసీఆర్ చేసి చూపించారని స్పష్టంచేశారు. పిల్లలకు ఎంత మంచి విద్యను అందిస్తే రాష్ర్ట భవిష్యత్ అంత బాగుంటుందని నమ్మిన కేసీఆర్.. రాష్ట్రంలో 200లకు పైగా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేశారని తెలిపారు.

మౌలానా అబుల్ కలాం పేరుతో 2,751 మంది మైనార్టీ విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున దాదాపు రూ.438 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. నాంపల్లిలో రూ. 100 కోట్ల విలువ గల 2 ఎకరాలు భూమి కేటాయించి రూ.40 కోట్లతో అనిసిల్ గుర్బా ను నిర్మించినట్లు తెలిపారు. మక్కా మసీదు మరమ్మతుల కోసం రూ.9 కోట్లు, ఇస్లామిక్ సెంటర్ కోసం రూ.40 కోట్లతో సెంటర్‌ను కోకాపేటలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేశామన్నారు.

రూ. 10వేల కోట్ల రూపాయలతో మైనార్టీ సంక్షేమం కోసం దేశంలోనే ఎవరు ఖర్చు చేయని విధంగా చేసినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా షాదీ ముబారక్ పేరుతో పేదింటి ఆడపిల్లల పెళ్లికి రూ.లక్షానూట పదహార్లు ఇచ్చామని, ఇమా మ్, మౌలానాలకు రూ. 5 వేలు నెలకు ఇచ్చినట్టు తెలంగాణ ఏర్పడిన వెంటనే మై నార్టీ కి డిప్యూటీ సీఎం గా చేశామన్నారు. హైదరాబాద్‌లో డిప్యూటీ మేయర్ పదవిని కూడా ముస్లింలకు కేటాయించామని గుర్తుచేశారు.  

పేదలు గుండెలు బాదుకుంటున్నా కాంగ్రెస్‌లో చలనం లేదు

ఇండ్లు కూలగొట్టద్దని పేదలు గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నా కాంగ్రెస్ అధిష్ఠానానికి చలనం లేదని కేటీఆర్ విమర్శిం చారు. సోమవారం ఎక్స్‌వేదిక స్పందిస్తూ.. ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా అంద క రైతన్నలు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారని అన్నారు. అరకొర రుణమాఫీతో రైతులను అరిగోస పెడతుంటే.. కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు.

గురుకుల పాఠశాల లో నిత్యం పుడ్ పాయిజన్ జరిగి విద్యార్థు లు ఆసుపత్రి పాలవుతున్న ఎందుకు సమీక్షించలేదని నిలదీశారు. ఆరు  గ్యారెంటీల హామీ జాడలేదని విమిర్శంచారు. రాష్ట్రం లో ఏసీబీ, జేసీబీ సర్కార్ నడుస్తుందని, కూల్చడం తప్ప నిలబెట్టడం తెలియని కాం గ్రెస్ ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేసేందుకు రేవంత్ సర్కార్ నేతన్నల కడు పు కొడుతుందని కేటీఆర్ విమర్శించారు.