calender_icon.png 28 April, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనాడైనా.. ఈనాడైనా.. ఏనాడైనా తెలంగాణకు విలన్ కాంగ్రెస్సే

27-04-2025 07:22:34 PM

తెలంగాణ ప్రజలు ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలుసు

ప్రజలు దీవిస్తే పదేళ్లపాటు ధగధగలాడే తెలంగాణను తయారు చేసుకున్నాం

హైదరాబాద్: ఆనాడు, ఈనాడు, ఏనాడైనా తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) అన్నారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహిస్తుంది. 24 ఏళ్లు పూర్తి  చేసుకుని బీఆర్ఎస్ పార్టీ(Bharat Rashtra Samithi) 25వ వసంతంలోకి అడుగుపెట్టింది. రజతోత్సవ సభావేదికపైకి కేసీఆర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివచ్చిన అందరికీ వందనాలు తెలిపారు.

కన్నతల్లిని, జన్మభూమిని మించిన స్వర్గం మరొకటి ఉండదని శ్రీరాముడు ఏనాడో చెప్పారని కేసీఆర్ గుర్తుచేశారు. వలసవాదుల విషకౌగిలిలో నలిగిపోతున్న  నా భూమిని విముక్తి కల్పించాలని భావించానని ఆయన వెల్లడించారు. వలసవాదుల నుంచి తెలంగాణను విముక్తి కల్పించేందుకు ఒక్కడినే బయలుదేరానని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు కొందరు వెటకారం చేశారని, అన్నింటినీ అధిగమించి పోరాడి తెలంగాణను సాధించానని కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రజలు దీవిస్తే పదేళ్లపాటు ధగధగలాడే తెలంగాణను తయారు చేసుకున్నామని తెలిపారు. రాణి రుద్రమ ఏలిన గడ్డ వరంగల్ కు వందనం చేస్తున్నా.. 1969లో మూగపోయిన తెలంగాణ ఉద్యమానికి మళ్లీ జీవం పోశానని చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపుజీ నివాసమైన జలదృశ్యం వేదికగా టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని కేసీఆర్ గుర్తుచేశారు. ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపుమని ఆనాడు చెప్పాను.. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలుసు అన్నారు. ఆనాడు కాంగ్రెస్, టీడీపీలో ఉన్న నేతలు పదవుల కోసం పెదాలు మూసుకుని కూర్చున్నారని గుర్తుచేశారు. శాసనసభలో తెలంగాణ అనే పదమే ఉపయోగించవద్దని రూలింగ్ ఇచ్చారని తెలిపారు.