calender_icon.png 28 December, 2024 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాశరథి కృష్ణమాచార్యకి నివాళులర్పించిన కేసీఆర్

05-11-2024 07:05:15 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): దాశరథి కృష్ణమాచార్య వర్థంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు.  ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... నా తెలంగాణ.. కోటీ రతనాల వీణ అని దాశరథి నివదించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమంలో దాశరథి అందించిన పోరాట స్పూర్తి ఉందని గుర్తు చేసుకున్నారు. దాశరథి కృషిని తమ బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించిందని, ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించే కార్యక్రమాలు చేపట్టామని  కేసీఆర్ చెప్పారు.