05-04-2025 12:00:00 AM
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తే మళ్లీ కేసీఆరే సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నా రని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేల మండలం బాది గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు సీడం నందు ఆధ్వర్యంలో పలువురు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీమంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలతో ఆదివాసులకు తీవ్ర నష్టం జరుగుతుందని గ్రహించి, ఆవేదనతో బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నమని పలువురు పేర్కొన్నట్లు జోగు రామన్న అన్నారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో ఆదివాసీలకు అన్ని విధాల ప్రోత్సాహం లభించిందని కొనియాడారు. మళ్లీ కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రౌతు మనోహర్, ప్రమోద్ రెడ్డి, సతీష్ పవార్, గంభీర్ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.