29-04-2025 01:26:53 AM
‘డూప్లికేట్ గాంధీ’ కామెంట్స్‌పై జగ్గారెడ్డి ఫైర్
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ సభలో డూప్లికేట్ గాంధీలు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ కుటుంబానికి ఓ చరిత్ర ఉందని ఆ కుటుబంపై కేసీఆర్ మాట్లాడి తనకున్న కొద్దిపాటి గౌరవాన్ని కోల్పోవద్దని సూ చించారు. రాష్ర్ట విభజనకు ముం దు వాళ్లు ఒరిజినల్ గాంధీలు ఇప్పుడేమో డూప్లికేట్ గాంధీలా..? ఇదే నా కేసీఆర్ మీరు నేర్చుకున్న రాజకీయ విలువలా అని నిలదీశారు.
రాహుల్‌గాంధీపై చేసి న వ్యాఖ్యలకు కేసీఆర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఒడిషా, పంజాబ్, కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కేసీఆర్ డబ్బు సంచులు మోసింది నిజం కాదా..? అని ప్రశ్నించారు.