calender_icon.png 25 October, 2024 | 12:52 PM

ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

12-07-2024 01:48:34 AM

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, వలసలపై చర్చించినట్టు సమాచారం

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌కు కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఓవైపు పార్టీ నేతల వలసలు, మరో వైపు అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలపై రేవంత్ సర్కార్ విచారణలతో గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈదెబ్బతో పార్టీ తిరిగి కోలువడం అంత సులువైన పనేమీ కాదనే చర్చ జరగుతున్న వేళ గురువారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నేతలం దరినీ ఫామ్‌హౌస్ తీసుకెళ్లినట్టు తెలిసింది. తాజా రాజకీయ పరిస్థితులు, వలసలపై చర్చించినట్టు సమాచారం. కేటీఆర్, హరీశ్‌రావు వారం రోజుల హస్తిన పర్యటన ము గించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

మరుసటి రోజే పార్టీ ముఖ్యలతో గులాబీబాసు సమావేశం కావ డం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీలో కవిత బెయిల్ పిటి షన్, పార్టీ ఫిరాయింపుల అం శంపై న్యాయ నిపుణులతో చర్చించారు. అయితే ఓవైపు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ టెన్షన్ పెడుతున్న వేళ, కేసీఆర్ ఫామ్‌హౌస్ కే పరిమితం కాగా, కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీ కి వెళ్లడం వచ్చీరాగానే ముఖ్యనేతలతో స మావేశం కావడంతో పార్టీలో ఏం జరుగుతున్నదనేది కార్యకర్తల్లో ఉత్కంఠంగా మారింది. త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు త్వర లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండగా, మరోపక్క టీడీపీ తెలంగాణలో పాగా వేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో కేసీఆర్ ఏ అంశాలపై ముఖ్య నేతలతో చర్చిం చారు? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.