calender_icon.png 5 April, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ కీలక సమావేశం

04-04-2025 11:25:53 AM

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) ఫోకస్ పెట్టారు. గత కొన్ని రోజులుగా కేసీఆర్ ఉమ్మడి జిల్లాల వారీగా ఎర్రవల్లి ఫాంహౌస్ లో వరస సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఏప్రిల్ 27న వరంగల్ లో నిర్వహించనున్న మహాసభను ప్రతిష్మాత్మకంగా తీసుకుని జయప్రదం చేయాలని, సంబంధించిన అంశాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్(KCR Erravelli Farmhouse) నివాసంలో నిర్వహిస్తున్న సమావేశానికి నాయకులందరూ రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President Kalvakuntla Taraka Rama Rao) పార్టీ నేతలకు ఆదేశించారు. కేసీఆర్ వరస సమావేశాలు చూస్తుంటే కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవుతూ.. గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతున్నారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారు. నియోజకవర్గానికి లక్షమందికి తగ్గకుండా సిల్వర్ జూబ్లీ వేడుకకు(BRS Silver Jubilee Celebration) స్వచ్ఛందంగా తరలి వస్తారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో గురువారం పార్టీ అధినేత కేసీఆర్(KCR) ఎర్రవెల్లి నివాసంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న బహిరంగ సభ, పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. పలు అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు జిల్లాల ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao), మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యేలు డా. కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు (కరీంనగర్), తోట ఆగయ్య (సిరిసిల్ల), జోగు రామన్న (ఆదిలాబాద్), బాల్క సుమన్ (మంచిర్యాల), మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్ కుమార్, రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టా మధు, కల్వకుంట్ల విద్యాసాగరరావు, నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధర్ రావు, పార్టీ జిల్లాల నాయకులు దావా వసంత, చల్మెడ లక్ష్మీ నరసింహారావు, జాన్సన్ నాయక్, రామకృష్ణారెడ్డి, రమాదేవి, కిరణ్ కొమ్మెర, విలాస్, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.