12-03-2025 10:01:37 AM
హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి బయల్దేరారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు(Kalvakuntla Taraka Rama Rao) వెల్లడించారు. గవర్నర్ ప్రసంగానికి, రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు కూడా కేసీఆర్ హాజరవుతానని పేర్కొన్నారు.