calender_icon.png 28 April, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్కతుర్తి సభకు బయలుదేరిన కేసీఆర్

27-04-2025 05:49:30 PM

గులాబీమయంగా మారిన ఎల్కతుర్తి ప్రాంతాలు

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఎర్రవల్లి ఫామ్ హౌజ్ నుంచి ఎల్కతుర్తి సభకు బయలుదేరారు. ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్ లో ఎల్కతుర్తి సభకు పయనం అయ్యారు. కాసేపట్లో బీఆర్ఎస్ రజత్సోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు.

దీంతో హనుమకొండ, ఎల్కతుర్తి ప్రాంతాలు గులాబీమయంగా మారాయి. మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) నేతలు రజతోత్సవ సభ వేదికపైకి చేరుకున్నారు. అటు హనుమకొండ, ఎల్కతుర్తి రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కోమటిపల్లి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. బీఆర్ఎస్ సభకు వెళ్తున్న వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్కతుర్తి మార్గంలో కారు దిగిన హరీశ్ రావు ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేశారు.