15-04-2025 01:18:47 AM
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రా వడం కల్ల. ఆ పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ కేటీఆర్ పగటి కలలు కనడం మానుకుంటే మంచిది’ అంటూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ హితవు పలికా రు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి నిర్వహించిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీఆర్‌ఎస్ నేతలు ఓర్చుకో లేకపోతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో భారీగా బియ్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. స్వయంగా కేసీఆర్ కుటుంబ సభ్యులే దొడ్డు బియ్యాన్ని సన్న బియంగా మార్చి, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. సన్న బియ్యం గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్ నేతలకు లేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అక్రమాలన్నింటినీ వెలికి తీస్తుందని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దేశ చరిత్రలో రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం పంపణీ చేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే చెల్లిందని కొనియా డారు. రాజ్యాంగ నిర్మాత అం బేద్కర్ జయంతి సందర్భం గా తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు జీవో విడుదల చేసిం దని కొనియాడారు.
ధరణిని ప్రక్షాళన చేసి భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. సామాజిక న్యాయం విషయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చాంపియన్‌గా నిలిచారని కొనియాడారు. మంగళవారం జరుగనున్న సీఎల్పీ సమావేశంలో 15 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చ ఉంటుందని వివరించారు.
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఇటీవల ఓ సీనియర్ నేతపై చేసిన ఆరోపణలపై ప్రశ్నించగా, పీసీసీ చీఫ్ స్పం దిస్తూ.. ‘రాజగోపాల్‌రెడ్డి అభిప్రాయా లు తన వ్యక్తిగతం’ అని సమాధానమిచ్చా రు. మంత్రివర్గ విస్తరణపై మీడియా ఓ ప్రశ్న సం ధించగా.. ‘పార్టీ ఓ సమష్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అని సమాధానాన్ని దాటవేశారు.
గాంధీభవన్‌లో అంబేద్కర్ జయంతి..
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గాంధీభవన్‌లో జయంతి వేడుకలు జరిగాయి. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌ డ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, పార్టీ నేత లు సంగిశెట్టి జగదీశ్, ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి, కైలాస్‌కుమార్, సిద్ధేశ్వర్, శ్రీనివాస్ తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. అంబేద్కర్ భారత ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు.