calender_icon.png 21 February, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డికీ కేసీఆర్ గతే

16-02-2025 12:33:21 AM

* మోదీ కులంపై మాట్లాడే స్థాయి నీది కాదు

* ఉద్యోగులను మోసగించిన కాంగ్రెస్‌పార్టీ

* ఆ పార్టీకి ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదు

* బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్

కరీంనగర్/ సిద్దిపేట, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ సామాజికవర్గంపై మాట్లాడే స్థాయి లేదని, అతడికి మతితప్పి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, రేవంత్‌కూ కేసీ  పట్టిన గతే పడుతుందని బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

శనివారం కరీంనగర్‌లోని శుభం కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన మీ  సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్రేకంలో అవాకులు, చవాకులు పేలుతున్నాడన్నాడని ఎద్దేవా చే  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ఒక భోగస్ ప్రక్రియ అన్నారు.

హిందూ ము  బీసీ ముస్లిం అని ప్రపంచంలోనే ఎక్కడైనా ఉందా, ఈ సర్వే దేశానికి రోల్ మో  అవుతుందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే లెక్కలు భోగస్ అని తేలడంతోనే మళ్లీ సర్వే చేస్తున్నారన్నారు. ప్రజలను మోసగించి పబ్బం గడుపుకోవాలనే కాంగ్రెస్‌కు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, టీచర్లు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమురయ్యలకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు. అంతకముందు సిద్దిపేటలో జరిగిన మీడియా సమావేశంలోనూ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. తెలం  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి ఎన్నికలని.. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నిరుద్యోగులకు, ఉద్యోగులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. మేధావులు, పట్టబధ్రులు, ఉపాధ్యాయులు విజ్ఞత  ఓటు వేయాలన్నారు.

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలన్ని చెల్లని రూపాయిగా మారాయని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్రమం తప్పకుండా డీఏలు ఇవ్వడంతో ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించారన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్స్ అభ్యర్థి కొమురయ్యలను గెలిపించాలన్నారు.