calender_icon.png 29 November, 2024 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ జాతిని ఏకం చేసిన నాయకుడు కేసీఆర్

29-11-2024 03:41:31 PM

వనపర్తి,(విజయక్రాంతి):  తెలంగాణ రాష్ట్రము సాధించడానికి  తెలంగాణ జాతిని ఏకం చేసిన నాయకుడు కె సి ఆర్ అని తెలంగాణ వచ్చుడో నేను సచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ ను సాధించడం జరిగిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద  దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళ్లు అర్పించి అక్కడే ఏర్పాటు చేసిన కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ను నిర్వహించి అనంతరం తెలంగాణ ఉద్యమానికి సంబందించిన డ్యాక్యుమెంటరీ ని పార్టీ ముఖ్య నాయకులతో తిలకించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ....  తెలంగాణ కోసం 24 ఏండ్ల సుదీర్ఘ పోరాటం అందులో 14 ఏండ్లు ఉద్యమ పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాష్టం ఏర్పాటు తరువాత 10 ఏండ్లు అభివృద్ధి నిర్మాణ పోరాటం చేసిన వ్యక్తి కె సి ఆర్ అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు ఎం కోరుకున్నారో ఆ దిశగా బి ఆర్ ఎస్ ప్రభుత్వం పని చేసిందన్నారు.

భారత దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతల్లో 72 శాతం పెంచడం జరిగింది. చిన్న చిన్న డిమాండ్లు పూర్తి కాకపోవడంతో కాంగ్రెస్ వైపు మల్లారన్నారు.  గడిచిన సంవత్సరంలో ప్రజల నుండి విరక్తి వచ్చిన ప్రభుత్వం యావత్ రాష్టంలో ఎక్కడా లేదని అది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కు దక్కిందన్నారు. కాంగ్రెస్ రాష్ట్రములో రైతుల పండుగ చేస్తున్నారంట దేని కోసం చేస్తున్నారు రైతులకు అన్ని చేసారని లేకపోతే , ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసారా అని దేని కోసం చేస్తున్నారో ప్రభుత్వం కు తెలియాలన్నారు.  పాలమూర్ లో ఒక మంత్రి బుద్ది మంతుడు మాట్లాడుతూ తెలంగాణ ఇస్తే నష్ట పోతామని తెలిసి కూడా సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పాడు సోనియా గాంధీ ఉంటే తెలంగాణ రాదు అని చెప్పి బి ఆర్ ఎస్ పార్టీ లో చేరి అధికారం ఎక్కడ ఉంటే అధికారం అనుభవించి కాంగ్రెస్ పార్టీలోకి వెల్లే వారు మాట్లాడుతున్నారని మరి అది నోరా లేకపోతే ఇంకా ఏమైననా అని వ్యగంగా మాట్లాడారు. పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్టు లో దాదాపు 90 శాతం పనులు పూర్తి చేయడం జరిగింది నార్లపూర్ లో ఒక మోటారు ను ప్రారంభీంచి కె సి ఆర్ నీళ్లు పారించారని, 2 వేల కోట్లు పెట్టి మిగిలిన పనులు పూర్తి చేస్తే పాలమూర్ పచ్చబడుతుంది మరి ఎందుకు చేయక నాన బెడుతున్నారని పాలమూర్ బిడ్డ అనే సి ఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నా రెడ్డి లు ఎం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.  కె సి ఆర్ కాళ్ళ గోటికి సరిపోని వాళ్ళు ఈరోజు ఎగిరి ఎగిరి పడుతున్నారని ఉద్యమం ను అణిచి వేయాలని మహా మహా నాయకులు కె సి ఆర్ ను ఏమి చేయలేక పోయారు మీరు ఏమి చేస్తారు ఒక్క వెంట్రుక కూడా ఏమి చేయలేరన్నారు. 

కేసిఆర్ ను ఒక్క రోజు అయినా జైలు పెట్టాలని చూస్తున్నారని కానీ కె సి ఆర్ అంటే ఒక్కరు కాదు బి ఆర్ ఎస్ కండువా వేసుకున్న ప్రతి ఒక్కరు కేసిఆర్లే ఎంత మందిని జైలు పెడుతారు జైలు సరిపోతాయా అని సవాళ్లు విసిరారు.  పలు మార్లు అవకాశాలు వచ్చి సి ఎం హోదాలో ఉండి వాళ్ళ నియోజకవర్గం లో ఎంత అభివృద్ధి చేసారో పరిశీలన చేస్తే ఒకసారి ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి అయినా తరువాత ఆ స్థాయి లో పని చేసి వనపర్తి నియోజకవర్గం ను అభివృద్ధి చేసి ప్రజల ముందు పెట్టడం జరిగిందన్నారు.  పాలమూర్ రంగారెడ్డి అద్భుతం నిర్మాణం చేపడుతున్నారని రైతులకు మంచి వ్యవసాయాధికారులు కావాలనంటే ఒక వ్యవసాయ కళాశాల అవసరం పాలమూర్ రంగారెడ్డి పూర్తి అయ్యే నాటి లోపే కళాశాల ను ఏర్పాటు చేయాలనీ కె సి ఆర్ ను ఒప్పించి రాష్ట్రము లోనే మొదటి వ్యవసాయ కళాశాల ను వనపర్తి నియోజకవర్గం కు తీసుకుని రావడం జరిగిందని , వనపర్తి ని జిల్లాగా ఏర్పాటు చేసి ఎన్నో కళాశాల ను తీసుకొని రావడం జరిగిందన్నారు. కొందరు స్థానికంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని భవిష్యత్ తరాలకు ఎం అవసరం ఉందొ అలాంటి ఉన్నత చదువులకు నిలయంగా వనపర్తి వైపు చూసేలా పనులు చేసానని చదువు రాని వారికి ఎం తెలుస్తుంది చదువు విలువన్నారు.

తెలంగాణ ను రూ 88 వేల అప్పుల కోట్ల తో రాష్ట్రము ఏర్పాటు అయిందని మన రాష్ట్ర వనరులు పెంచుకుని ఏ రంగాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు మంచి గా చేసుకుంటూ భారత దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కె సి ఆర్ పని చేసి చూపించాడన్నారు.  రూ  రైతు బీమా 5 వేల కోట్లు, ఉచిత విద్యుత్ 6 వేల కోట్లు, చెరువులు కుంటలు వంటివి చేస్తూ 46 వేల చెరువులను, 46 వేల కోట్లతో మిషిన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరు, ఇలా ఒక్క వ్యవసాయం రంగం పై 4 లక్షల 75 వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.  వ్యవసాయం అభివృద్ధి చేయడం వల్ల వలసలు తిరిగి వచ్చారని . నాడు గంజి కోసం ఎంతో మంది ఉన్న ఊరు కుటుంబ సభ్యులను వదిలి పెట్టి వలసలు వెళ్లిన సందర్భాలు నుండి వలసలు తిరిగి రావడంతో దేశానికి అన్నం పెట్టె స్థాయికి రైతులు ఎదగడం జరిగింది అది కేసిఆర్ ముందు చూపుకు నిదర్శనమన్నారు. కాళేశ్వరం కు ప్రాజెక్టు మొత్తం 90 వేల కోట్ల తో నిర్మిస్తే దాని మీద లక్ష కోట్లు అవినీతి అని అంటారు అది నోరా లేక తాటి మట్టనా అని ఆయన ప్రశ్నించారు. కేసి ఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ పరీక్షలు అన్ని అయినా తరువాత ప్రభుత్వం ఓడిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తరువాత వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు మేము ఇచ్చామనడం అబ్దదాలకు నిదర్శనమన్నారు.

  తెలంగాణ ఏర్పాటు తరువాత అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భారత దేశం లో తలసరి ఆదాయం వచ్చే అధిక రాష్ట్రము గా తెలంగాణ రాష్టాన్ని చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కు ఇస్తే   ప్రతి రోజు అప్పులు చేశారు అని చెప్పడం సిగ్గుగా అనిపించడం లేదా అని ఆయన విమర్శలు చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 11 నెలలో రూ 85 వేల కోట్ల రూపాయల అప్పు చేసారని రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వకుండా మీ మంత్రుల గుత్తే దారులకు ఇచ్చారన్నారు . రాష్ట్ర  వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో విద్యార్థులు పట్టించుకోకుండా పుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు నానా గోస పడుతుంటే విద్యార్థులను వారికీ అందించాల్సిన సౌకర్యాలను కల్పించకుండా ఉన్నారు కానీ కోట్లు ఖర్చు పెట్టి విద్యాలయాలు ఏర్పాటు చేస్తారంట ఇది ఎవరైనా నమ్ముతారా అని ఆయన ప్రశ్నించారు.  వనపర్తి కి తలమానిక మైన పాలిటెక్నీక్ కాళశాల అభివృద్ధి కోసం రూ 23 కోట్లు, మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల అభివృద్ధి కోసం 50 కోట్లు, రూ 22 కోట్ల తో ఐ టి టవర్ జీవో లు తెచ్చిన టెండర్ల దశ వచ్చే నాటికీ ప్రభుత్వం మారిందని వచ్చిన నిధులకు టెండర్లు నిర్వహించడం మానేసి టెండర్లను రద్దు చేసారన్నారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.