కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఇన్చార్జి టీఆర్ఎస్ దివాస్ కార్యక్రమ ఇంచార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అన్నారు. మంగళవారం దీక్ష దివాస్ కార్యక్రమం సన్నాక సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన కేసీఆర్ చరిత్ర ప్రజలందరికీ తెలియాలని ఆయన అన్నారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ అమరాన నిరాహార దీక్ష చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పరిపాలిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ప్రజలు విసిగిపోయారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ నాయకుల మధ్యనే ఐక్యత లేదనేది ప్రజలకు తెలిసిందన్నారు. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదన్నారు. ప్రజలు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు. రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనేనని అన్నారు.
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను తప్పిందని అన్నారు. కామారెడ్డిలో ఈనెల 29 నిర్వహించే దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ను ప్రజలు నమ్మి మోసపోయారని అన్నారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపి గౌడ్, గండ్ర మధుసూదన్ రావు, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విప్పిరి వెంకటి, నాగిరెడ్డిపేట మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, బల్వంతరావు, తదితరులు పాల్గొన్నారు.