calender_icon.png 3 April, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా వికాసానికి కేసీఆర్ పునాది

27-03-2025 01:30:59 AM

మండలిలో ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): తెలంగాణలో విద్యా వ్యవస్థ నాశనమైందని పేర్కొనడం దారుణమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ పాలనలో విద్యా వికాసానికి కేసీఆర్ పునాది వేశారన్నారు. బుధవారం శాసనమండలిలో విద్యారంగంపై జరిగిన చర్చలో కవిత మాట్లాడారు. కేసీఆర్ హయంలో పాఠశాలలు మూతపడ్డాయని కాంగ్రెస్ నాయకులు చెప్పడం విడ్డూరమన్నారు.

తెలంగాణ ఏర్పడే నాటికి 29,268 ప్రభుత్వ పాఠశాలలు ఉండేవని.. 2023 నాటికి ఆ సంఖ్య 30వేలకు పెరిగిందన్నారు. ఉన్నత విద్యలో ఎన్‌రోల్ మెంట్ అంశంలో దేశ సగటుతో పోలిస్తే తెలంగాణను కేసీఆర్ నెంబర్‌వన్‌గా మార్చినట్టు గుర్తుచేశారు. రీయింబర్స్‌మెంట్ కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో 24 వేల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు.