కాళేశ్వరం కమిషన్ చేతికి కీలక ఆధారాలు!
- మూడు బరాజ్‌లలో నీళ్లు నింపమని ప్రభుత్వాధినేత ఆదేశించారన్న మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు
- డీపీఆర్‌ను ఆమోదించింది ఆయనే.. డిజైన్లు, డ్రాయింగ్స్ కేసీఆరే ఫైనల్ చేయమన్నారు
- మినిట్స్ డాక్యుమెంట్స్‌ను కమిషన్‌కు అందజేత
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): కాళేశ్వరం కమిషన్ విచా రణ వేగంగా సాగుతున్న కొద్దీ కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కమిషన్ సోమవారం జరిపిన విచారణలో మరికొన్ని ముఖ్యమైన విష యాలు వెలుగులోకి వచ్చాయి.
మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం కమిషన్‌కు పలు కీలక డాక్యుమెంట్లు అందజేసినట్లు తెలిసింది. కాళేశ్వరం డీపీఆర్‌ను అప్పటి సీఎం కేసీఆర్ ఆమోదించినట్లు విచారణలో మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇందుకు సంబంధించిన అప్పటి సీఎం ఆమోదం తెలిపిన డాక్యుమెం ట్లు, అన్నారం ఆక్సిస్ చేంజ్ డాక్యుమెంట్లు, జియోటెక్నికల్ ఫౌండేషన్ టెస్టుల వివరాలకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలను కమిషన్‌కు ఆయన సమర్పించారు. అంతేకాకుండా మినిట్స్ దస్త్రాలను సైతం కమిషన్‌కు ఆయన అందజేశారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు సంబంధించిన అంశాలపై వెంక టేశ్వర్లును జస్టీస్ పీసీ ఘోష్ ప్రశ్నించగా కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను కేసీఆరే ఆమోదించారని, డిజైన్లను కూడా ఆనాడు కేసీఆరే ఫైనల్ చేయాలని చెప్పినట్లు తెలిపారు.
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కారణంగానే మేడిగడ్డ డ్యామేజ్ అయింది కదా?.. అలాగే మేడిగడ్డతోపాటు మూడు బరాజ్‌లలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారు? అని వెంకటేశ్వర్లును కమిషన్ ప్రశ్నించింది.
దీనికి సమాధానంగా నాన్ అవైలెబిలిటీ ఆఫ్ టెయిల్ వాటర్, ఆపరేషన్ ఆఫ్ గేట్స్ కారణంగా డ్యామేజ్ అయిందని వెంకటేశ్వరు చెప్పినట్లు తెలి సింది. మూడు బరాజ్‌లలో నీళ్లను నింపమని అప్పటి ప్రభుత్వ అధినేతే ఆదేశించారని కమిషన్‌కు చెప్పినట్లు సమాచారం.
ఘోష్ కమిషన్‌కు మహారాష్ట్ర రైతుల లేఖ
ఇదిలా ఉంటే మేడిగడ్డ బరాజ్ నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మహారాష్ట్ర రైతులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు లేఖ రాశారు. గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలుకాలోని సుమారు పది గ్రామాలకు చెందిన భూమిని ఈ బరాజ్ నిర్మాణానికి సేకరించారని తెలిపారు.
అయితే సర్వే చేపట్టిన అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారని బాధిత రైతులు వాపోయారు. ముందస్తుగా మేడిగడ్డ వల్ల తమ గ్రామంలో 378.2 హెక్టార్ల భూమి మాత్రమే అవసరపడుతుందని అంచనా వేసిన అధికారులు..
ఈ బరాజ్ నిర్మాణం పూర్తయిన తర్వాత అదనంగా మరో 500 హెక్టార్ల వరకు భూమి ముంపునకు గురవుతున్నదని చెప్పారన్నారు. మేడిగడ్డ నిర్మాణంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీస ప్రమాణాలు పాటించలేదని రైతులు ఆరోపించారు. తరతరాలుగా వ్యవసాయం చేసుకుం టూ జీవనం సాగిస్తున్న తాము ఉపాధి కోల్పోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.