కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : మాజీ సీఎం కేసీఆర్ ఇంకా పగటి కలలు కంటున్నారని, సీఎం కుర్చీ నుంచి జనం లాగిపడేసినా సిగ్గు రావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. సీఎం పదవి నుంచి దిగిపోయాక తెలంగాణ ప్రజలు అన్నం, నీళ్లు మానేశారని కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు. ఫామ్‌హౌస్‌లో చెట్ల కింద కూర్చొని సేద తీరుతున్నారని, చేయడానికి పనిలేక మరో ఊహాప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాడని విమర్శించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడి యా హాల్లో మాట్లాడారు.
కేసీఆర్ తీరు బాద్షా సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్లా ఉన్నదని ఎద్దేవా చేశారు. జనం పాలిచ్చే బర్రెను వదులుకొని దున్నపోతును తెచ్చుకు న్నారని మాట్లాడడంపై రామ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు పనికిరాని దున్నపోతును తన్ని తరిమేసి.. కామధేనువు లాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులు కేసీఆర్ ట్రాప్‌లో పడొద్దన్నారు. సాంకేతిక సమస్యలను ఆసరగా చేసుకుని నిరుద్యోగులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు.