calender_icon.png 25 March, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

చంద్రబాబు గెలిచినందుకు బాధపడుతున్న కేసీఆర్

23-03-2025 09:13:25 PM

ఇల్లెందు (విజయక్రాంతి): తెలంగాణలో కేసిఆర్ ఓడిపోయిన దానికన్న ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గెలిచినందుకే కేసిఆర్ ఎక్కువగా బాధపడుతున్నారని ఇల్లందు నియోజకవర్గ టిడిపి నాయకుడు ముద్రగడ వంశీ అన్నారు. ఆదివారం టిడిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో తను నిలదొక్కుకోవాలనుకున్న ప్రతిసారి చంద్రబాబునాయుడు,  తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడం కేసీఆర్ కు సర్వసాధారణమై పోయిందన్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో పదేళ్లు పాలించారని, మళ్లీ తెలంగాణ ఉద్యమం చేయాలని అంటున్నా కేసిఆర్ ఎవరికోసం మీ మనుగడ కోసమా, మీ కుటుంబం కోసమా ప్రతిసారి బిఆర్ఎస్ కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబును తిట్టడం ఏమిటని ప్రశ్నించారు.

5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడలేదని, తెలంగాణ ప్రాంతం మా సొంతం ఆంధ్ర పార్టీ తెలంగాణ ద్రోహి అని మీ స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడును ఎన్నో మాటలు అన్నారో గుర్తుంచుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణలో అని, ఇక్కడ పుట్టిన తెలంగాణలో తెలుగుదేశానికి పాలించే హక్కు లేదా అని, ఎక్కడో పుట్టిన పార్టీలు తెలంగాణలో హక్కు ఉంటుందని అని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్ ఇతర రాష్ట్రలో పని చేసే హక్కు ఉంటుందా అని, తెలుగుదేశం పార్టీకి ఆ హక్కు లేదా అన్నారు. బిఆర్ఎస్ ను జాతీయ పార్టీ అని మహారాష్ట్రలోని ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందాలేదా అని ప్రశ్నించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకోవద్దని,  ప్రజలు మీకిచ్చిన 10 ఏళ్ల  పాలన చాలని ఇంటికి పంపారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంపై విలువ లేనట్టుగా మీ మాట కనిపిస్తుందని, మీరు ఇతర రాష్ట్రాల్లో పార్టీ పెట్టడానికి పనిచేయడానికి లేనిది ఈ రాష్ట్రంలో పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీకి ఉండొద్దనే హక్కు మీకు లేదన్నారు. అధికారం అనుభవించి ప్రస్తుతం ప్రతిపక్ష హోదా ఇస్తే దాన్ని తగ్గట్టుగా పనిచేయకుండా అదే ఫామ్ హౌస్ లో ఉంటూ పదిమందిని కూర్చోబెట్టుకొని ఇక్కడున్న సమస్యల మీద కాకుండా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీపై ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.

మరోసారి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ పట్ల ఇస్తానుసారంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చాందావత్ రమేష్ బాబు, టీడీపీ సీనియర్ నాయకులు కారు నర్సన్న, అయ్యోరి నాగరాజు, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు దాసరి గోపాలకృష్ణ, ముక్కు శ్రీవెద్, దేవరకొండ నవీన్, హరిశ్వర్ తదితరులు పాల్గొన్నారు.