26-03-2025 01:05:31 AM
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, మార్చి 25 (విజయ క్రాంతి): తి): కేజీ టు పీజీ విద్యను ప్రారంభిస్తా, కార్పొరేట్ కళాశాలల కాళ్లు విరుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గత దశాబ్ద కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ తీరుతో విద్యా వ్యవస్థ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లిందన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలు నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ పాఠశౠలలను ప్రోత్సహించి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారని తెలిపారు. కేసీఆర్ హయాంలో విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు అధిక నిధులు కేటాయిస్తున్నారని, గతంలో ఎన్నడు లేని విధంగా బడ్జెట్లో విద్యాభివృద్ధికి 23,108 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదించిందని అన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభించాలని సంకల్పించి సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 11 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు.