calender_icon.png 28 December, 2024 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెసిఆర్ కనబడుటలేదు

06-10-2024 04:26:56 PM

గజ్వేల్ పోలీస్ స్టేషన్లో పిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు ఫిర్యాదు 

గజ్వేల్ (విజయక్రాంతి) : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదంటూ గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో టిపిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు ఆదివారం ఫిర్యాదు చేశారు. కెసిఆర్ ఆచూకీ తెలిపి  నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని  ఫిర్యాదులో శ్రీకాంత్ రావు పేర్కొన్నారు. అనంతరం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ  కెసిఆర్ ఎక్కడున్నా వారం రోజులలో గా కనిపెట్టి తీసుకురావాలని, లేనిపక్షంలో తామే వెతుక్కుంటామని తెలిపారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు పది నెలలు కావోస్తున్న ఇప్పటికీ నియోజకవర్గ ప్రజలకు కనపడలేదని, ప్రజలంతా కేసిఆర్ క్షేమంగా ఉన్నారా లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. వెంటనే పోలీసులు కెసిఆర్ ఎక్కడున్నా గుర్తించి తీసుకురావాలని కోరినట్లు చెప్పారు. టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి నాయిని  యాదగిరి, మండల అధ్యక్షుడు మద్దూరి మల్లారెడ్డి, తెగులు మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ తదితరులు ఉన్నారు.