బీఆర్‌ఎస్ నేత రాకేశ్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): కేసీఆర్ తెలంగాణలోని అన్నివర్గాల ప్రజల గుండెల్లో ఉన్నారని, భయం రూపంలో కాంగ్రెస్ నేతల గుండెల్లో కూడా కేసీఆర్ ఉన్నారని బీఆర్‌ఎస్ నేత రాకేశ్‌రెడ్డి అన్నారు. పది నెలల కాంగ్రెస్ పాలన చూసిన రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని విమర్శించారు.
ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వరి కోతలు ప్రారంభమయ్యాయని, ఇప్పటివరకూ క్వింటా ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. అకాల వర్షాలతో వరి ధాన్యం తడుస్తోందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇప్పుడు మిల్లర్లు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు.
తెలంగాణ రైతుల ధాన్యాన్ని ఏపీ మిల్లర్లు కొనుక్కుంటున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధాన్యం కేంద్రాలను ప్రారంభించి డీలర్లుగా మిగిలారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్న కేంద్రమంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. వ్యవసాయ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించిందే కేసీఆర్ అని, కేసీఆర్‌ను కాంగ్రెస్ నాయకులు ఎందుకు తిడుతున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.