calender_icon.png 27 October, 2024 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవితను చూసి కేసీఆర్ భావోద్వేగం

30-08-2024 01:17:42 AM

ఎర్రవెల్లిలో తండ్రిని కలిసి పాదాలకు నమస్కారం 

హత్తుకుని ఆశీర్వదించిన కేసీఆర్

అభిమానులు ఎవరూ రావద్దన్న కవిత 

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విడులైన ఎమ్మెల్సీ కవిత గురువారం ఎర్రవెల్లి నివాసానికి వెళ్లి తన తండ్రి కేసీఆర్‌ను కలిసింది. చాలా రోజుల తరువాత వచ్చిన బిడ్డ కవితను చూడగానే మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి పాదాలకు కవిత సమస్కరించగా బిడ్డను ఆప్యా యంగా గుండెలకు హత్తుకుని ఆశీర్వదించారు. ఎర్రవెల్లి నివాసానికి కవిత తన భర్త అనిల్, కుమారుడితో కలిసి వెళ్లగా సిబ్బంది ఆమెకు దిష్టి తీసి స్వాగతం పలికారు.

బిడ్డను చూడగానే కేసీఆర్ ముఖంలో ఆనందం కనిపించింది. చాలా కాలం తరువాత ఉత్సా హంతో కేసీఆర్ కనిపించారు. కవిత రాకతో ఫాంహౌస్‌లో కోలాహలంగా మారింది. 10 రోజుల పాటు అక్కడే ఆమె విశ్రాంతి తీసుకోనున్నారు. బెయిల్‌పై కవిత విడుదల కావ డంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో సంతోషం నెలకొంది. అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, ఫౌంహౌస్‌లో పనిచేస్తున్న సి బ్బందిని పేరు పేరునా పలకరించి వారి యోగ క్షేమాలను కవిత అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తనను కలిసేందుకు ఎవరు ఫామ్‌హౌస్‌కు రావద్దని కవిత విన్నవించారు. 

తాజా రాజకీయాలపై చర్చ.. 

  ప్రస్తుతం రాష్ట్రంలో జరిగే రాజకీయాలతో పాటు రేవంత్ సర్కార్ పనితీరుపై కేసీఆర్‌తో కవిత చర్చించినట్లు తెలిసింది. ముందుగా ఉన్న 28 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుని పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై వేటు పడే విధంగా వ్యూహరచన చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. అదే విధంగా తనను అక్రమంగా అరెస్టు చేసిన బీజేపీని ఏవిధంగా ఇరుకున పెట్టాలో వంటి అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. ఆమెకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉండటంతో అక్కడే వైద్యులతో చికిత్స తీసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు, పూర్తిగా కోలుకున్న తరువాత తన కార్యాచరణ ప్రకటించనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.