రాకింగ్ రాకేశ్ స్వీయ నిర్మాణంలో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కేశవ చంద్ర రమావత్ కేసీఆర్’. గరుడవేగ అంజి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. లంబాడీ వర్గానికి చెందిన యువకుడి నిజ జీవితం స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను ‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి శుక్రవారం లాంచ్ చేశారు. ఈ సినిమాను నవంబర్ 22న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు.
అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని చిత్ర దర్శకుడు అంజి వెల్లడించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దీప ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్, జోర్దార్ సుజాతా రాకేశ్ దంపతులు పాల్గొన్నారు. తనికెళ్ల భరణి, ధనరాజ్, తాగుబోతు రమేశ్, జోర్దార్ సుజాత, లోహిత్ కుమార్, బలగం మైమ్ మధు, రచ్చ రవి, కృష్ణ భగవాన్, అంజి, సాయి చరణ్ కిష్టప్ప, జబర్దస్త్ ప్రవీణ్, జబర్దస్త్ నవీన్, జబర్దస్త్ రాజ్, కీర్తి లత, బలగం తాత, జబర్దస్త్ కర్తానందం ముఖ్య తారాగణంగా ఉన్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్; డైలాగ్స్: రాజ్‌కుమార్ కుసుమ; సినిమా టోగ్రఫీ, దర్శకత్వం: గరుడవేగ అంజి.