స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు...
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా దీక్ష దివస్....
మేడిపల్లి (విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి పిలువు మేరకు మేడ్చల్ జిల్లా దుండిగల్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ స్వామి గౌడ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు శంబిపుర్ రాజు అధ్యక్షతన దీక్షా దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్ తెగించినందునే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, పదేండ్లపాటు ఆయన పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి ఆదర్శంగా తీర్చిదిద్దారని పలువురు కొనియాడారు. తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమం సాగించి.. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సందర్భంగా ఉద్యమ క్షణాలను నెమరేసుకొని మరోమారు తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకై పునరంకితమవుదామని పిలుపిచ్చారు.
అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యేవరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చామకుర మల్లారెడ్డి,కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు,బండారి లక్ష్మారెడ్డి,మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కవెంకట్ రెడ్డి, బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి, నందికంటి శ్రీధర్, జహంగీర్ పాషా, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ కొల్తూరి మహేష్, నాయకులు లేతకుల రఘుపతి రెడ్డి, పీర్జాదిగూడ ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్ రెడ్డి, మనోరంజన్ రెడ్డి, జావీద్ ఖాన్, నిర్మల, ప్రభు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మహిళ నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.