calender_icon.png 1 February, 2025 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలను అవమానించిన కేసీఆర్

01-02-2025 01:54:48 AM

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): తులం బంగారానికి ఆశపడి ఓటే శారని, అమ్ముడుపోయారని కేసీఆర్ మహిళలను కించపరిచారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేయాలనే విషయంపై కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తాడని ఎద్దేవా చేశారు. 10 ఏండ్లు బాధ్యత లేని పరిపాలన చేసిన కేసీఆర్ నువ్వు మమ్మల్ని కొట్టేది ఏంది.. మేమే నిన్ను దంచి కొడుతాం అం టూ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

కేసీఆర్ 5 లక్షల మందితో సభపెడితే... తాము 5 లక్షల ఒక్క వెయ్యి మందితో పెడతామని సవాల్ విసిరారు. రియల్ ఎస్టేట్ కొంపముంచింది, నాశనం చేసిందే కేసీఆరేనని ఆరోపించారు.