హైదరాబాద్, నవంబర్ 28 (విజయ క్రాంతి): బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డిని మాజీ సీఎం కేసీ ఆర్ దంపతులు గురువారం ఘనంగా సన్మా నించారు. ఎర్రవల్లిలోని తన నివాసానికి వచ్చిన ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు కేసీఆర్ శాలువాకప్పి, ఆయన మెడలో విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్ అనే లాకెట్‌ను వేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తూ.. కేసీఆర్ వద్ద 25 ఏళ్ల పాటు పనిచేయ డం తన అదృష్టమన్నారు. అమెరికాకు వెళ్ల డం తప్పనిసరి అయ్యిందని, తెలంగాణ గడ్డను వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందని ఆయన పేర్కొన్నారు.