29-03-2025 12:00:00 AM
మాజీ మంత్రి హరీశ్‌రావు
మన్నే గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 (విజయక్రాంతి): మైనార్టీల సంక్షేమానికి పెద్దపీ ట వేసి, వారి గౌరవాన్ని పెంచింది మాజీ సీఎం కేసీఆరేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మన్నే గోవర్ధన్‌రెడ్డి ఆ ధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని లేక్‌వ్యూ ఫం క్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కు ఆయన హాజరై మాట్లాడారు. ఇఫ్తార్ విం దును అధికారికంగా నిర్వహించని కాంగ్రెస్ రంజాన్‌తోఫా కూడా ఇవ్వలేదని విమర్శించారు. మైనార్టీల కోసం రూ.3300కోట్లు కాంగ్రెస్ కేటాయించి రూ.వె య్యికోట్లే ఖర్చు చేసిందని, ఈసారి బడ్జెట్‌లో కోత పెట్టిందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన టేమరిస్ స్కూళ్లను ఇంటిగ్రేటెడ్‌లో కలపాలని కాంగ్రె స్ కుట్ర చేస్తోందన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ పాల్గొన్నారు.