calender_icon.png 4 April, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ అద్భుతాలు సృష్టించారు

22-03-2025 01:56:26 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి 

హైదరాబాద్, మార్చి 21(విజయక్రాంతి): గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో వ్యవస్థల విధ్వంసం, ఆర్థిక అరాచకత్వం అని బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తవించడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై  జరిగిన చర్చలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ పాలనలో అద్భుతాలను సృష్టించారని చెప్పారు. గత పదేళ్ల పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సంక్షేమం, జీఎస్డీపీ, తలసరి ఆదాయం, పంటల దిగుబడి, వ్యవసాయంతో పాటు అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు.