calender_icon.png 17 March, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూతు పురుణాల్లో కేసీఆర్‌కు పేటెంట్

17-03-2025 01:42:40 AM

  1. ఆయన తిట్లతో పుస్తకమే రాయొచ్చు
  2. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 
  3. హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): గత పదేళ్లలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేసీఆర్ మాట్లాడిన ఎన్నో బూతు మాటలు, తిట్ల పురాణాలతో ఒక బూతు పుస్తకమే రాసి ఉండొచ్చని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలో బూతు పురాణానికి పేటెంట్ ఉంటే అది కేసీఆర్‌కే దక్కుతుందని ఆదివారం ఒక ప్రకటనలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

‘మీరు చేస్తే సంసారం.. ఎదుటోళ్లు చేస్తే వ్యభిచారమా? కేసీఆర్ మాట్లాడితే నీతులు.. ఎదుటివాళ్లు మాట్లాడితే బూతులా?’ అని చామల ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నాయకులు నీతులు చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని మాజీమంత్రి హరీశ్‌రావుపై ఫైరయ్యారు.

ఎదుటివారిపై విమర్శలు చేసే ముందు తమ గురించి తాము ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. తాము అధికారంలోకి వచ్చాక ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చామనేది యువతకు తెలుసనని, రుణమాఫీ చేసింది, లేనిది రైతులే చెబుతారన్నారు. హరీశ్‌రావు తరుచూ సవాళ్లు విసరడం మానుకోవాలని సూచించారు.