దాసోజు శ్రవణ్
హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి పాచికల్లు తాగిన మనిషుల్లా కేసీఆర్‌పై విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ 40 ఏళ్లకు పైగా ప్రజా జీవితంలో ఉన్నారని, పదేళ్లు సీఎంగా, ఒకసారి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పని చేసిన సంగతి కాంగ్రెస్ పాలకులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మాట్లాడినట్లు గల్లీ రౌడీలు కూడా మాట్లాడరని, కేసీఆర్ వయసుకు గౌరవం ఇవ్వకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు.