calender_icon.png 20 April, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

20-04-2025 04:06:32 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత బలాన్ని అందించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కేటీఆర్ శుభాకాంక్షలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా నాయుడు ఆరోగ్యం,  ప్రజా సేవలో దీర్ఘాయుష్షు కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ప్రముఖ నాయకుడికి రాబోయే సంవత్సరం సంపన్నంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా రాశారు.