11-02-2025 01:12:08 AM
కరీంనగర్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నా డని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. సోమవారం కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్‌రెడ్డి దాఖలు చేశారు.
మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారా వు, కొండా సురేఖ, సీతక్కలతోపాటు నాలుగు ఉమ్మడి జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహిం చారు. తెలంగాణ చౌక్ వద్ద మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. నరేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరా రు.
కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా నిలుస్తుందని తెలిపారు. కేసీఆర్ ఏడాదికి ఐదువేల ఉద్యోగాలిస్తే, సీఎం రేవంత్‌రెడ్డి నెలకు ఐదువేల ఉద్యోగాలు ఇస్తున్నాడని తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ రూపాయి కూడా తీసుకురాలేదని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పట్టభద్రులకు కాంగ్రెస్ ఎంతో మేలు చేసిందన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పదేళ్లుగా కలిసి పనిచేస్తున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తామంతా జీవన్ రెడ్డిని పోటీ చేయమని కోరామని, జీవన్ రెడ్డి పోటీకి దూరంగా ఉంటానని చెప్పడంతో సమర్థుడైన నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చామన్నారు.
ఎమ్మె ల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తన విజయాన్ని కాంగ్రెస్‌కి గిఫ్టుగా ఇస్తానని, జీవన్‌రెడ్డి తనకు రోల్ మోడల్ అని, ఆయన స్ఫూర్తి తో పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌కు అభ్యర్థుల కరువు
గజ్వేల్: పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని, ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి వెనుకా డుతున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. సోమవారం గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ షబ్బీర్ అలీతో కలిసి మీడియాతో మాట్లాడారు.
బీఆర్‌ఎస్‌లో కేటీఆర్, కవిత, హరీశ్‌రావు అనే మూడు ముక్కలాట కొనసాగుతుందన్నారు. ప్రజలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతిస్తుందని ఆరోపించారు.
ఇక్కడి బీజేపీ నేతలకు మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందడం ఆనవాయితీగా మారిందన్నారు. కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రీసర్వే జరపాలని అడిగే అర్హత లేదన్నారు. ఆయనవెంట డీసీసీ అధ్యక్షుడు తూంకుం ట నర్సారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఉన్నారు.