calender_icon.png 20 September, 2024 | 6:25 AM

చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి కేసీఆర్ కృషి

19-09-2024 01:08:30 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): కేసీఆర్ పాలనలో ఎంఎ స్‌ఎంఈలు ఎంతో అభివృద్ధి చెందాయని, ఇది ముమ్మాటికీ బీఆర్‌ఎస్ ఘనతగా చెప్పుకోవచ్చని మాజీమం త్రి హరీశ్‌రావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా టైమ్‌లో దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంఎస్‌ఎంఈలు మూతపడినా తెలంగాణలో అనుసరించిన ఐపాస్ లాంటి విధానా ల వల్ల దృఢంగా నిలబడ్డాయన్నారు. పెట్టుబడుల్లో 115 శాతం పెరుగుదలతో దేశంలో అగ్రగామిగా నిలవడ మే కాకుండా ఉద్యోగాల కల్పనలో 20 శాతం వృద్ధిరేటు సాధించినట్లు తెలిపారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో స్థిరమైన వృద్ధిని నమోదు చేసి.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీఆర్‌ఎస్ పాలనలో సాధించిన ఘనతను వారి ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్పుకొంటుందని మండిపడ్డారు. ఎం ఎస్‌ఎంఈ అభివృద్ధికి తాము చేసిన కృషి ఏంటో.. భవిష్యత్తు కార్యాచరణ ఏమిటో చెప్పకుండా గత ప్రభుత్వ విజయాలతో కాలం గడపడం శోఛనీయమన్నారు.